అప్పుడే ఫిక్స్ అయ్యా.. రిటైర్మెంట్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సీనియర్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు జట్టుకు ఎంపికైనా అశ్విన్.. మంగళవారం ESPNcricinfo చేసిన ఇంటర్వ్యూలో తన ఆవేదన వెల్లగక్కాడు. 2018లో ఇంగ్లాండ్ టూర్, ఆడిలైడ్ టెస్టు తర్వాత తన కెరీర్‌లో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. గాయాల కారణంగా కనీసం ఓవర్‌లోని ఆరు బంతులు కూడా వేయకపోవడం తనను ఎంతో బాధించిందని.. ఇటువంటి సమయంలో జట్టు మద్దతు కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సీనియర్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు జట్టుకు ఎంపికైనా అశ్విన్.. మంగళవారం ESPNcricinfo చేసిన ఇంటర్వ్యూలో తన ఆవేదన వెల్లగక్కాడు. 2018లో ఇంగ్లాండ్ టూర్, ఆడిలైడ్ టెస్టు తర్వాత తన కెరీర్‌లో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. గాయాల కారణంగా కనీసం ఓవర్‌లోని ఆరు బంతులు కూడా వేయకపోవడం తనను ఎంతో బాధించిందని.. ఇటువంటి సమయంలో జట్టు మద్దతు కూడా లేకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటిద్దామని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.
ఈ సమయంలో తన కుటుంబ సభ్యులు తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చినట్టు అశ్విన్ తెలిపాడు. ఆ ధైర్యంతోనే చనిపోయేలోపు మళ్లీ వైట్ బాల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యాను అని చెప్పాడు. కాగా, టీ 20 వరల్డ్ కప్‌లో రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ వైట్ బాల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూజీలాండ్ టీ20 సిరీస్‌లో కూడా తన ట్యాలెంట్‌ను నిరూపించుకుని వైట్ బాల్ క్రికెట్‌లో తన స్థానం పదిలం చేసుకోవడం విశేషం. ఇక ఆదివారం నుంచి జరగబోయే టెస్టు మ్యాచులో రాణిస్తామంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.