తగ్గిన SpiceJet నష్టాలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్(SpiceJet)ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టాలు రూ. 112.6 కోట్లకు తగ్గాయని వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 462.6 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ. 1,305 కోట్లుగా నమోదైందని, గతేడాది ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ. 3,074 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. కార్గో వ్యాపారం(Cargo business)ద్వారా వచ్చే ఆదాయం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్(SpiceJet)ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టాలు రూ. 112.6 కోట్లకు తగ్గాయని వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 462.6 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ. 1,305 కోట్లుగా నమోదైందని, గతేడాది ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ. 3,074 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది.
కార్గో వ్యాపారం(Cargo business)ద్వారా వచ్చే ఆదాయం వార్షిక ప్రాతిపదికన 157 శాతం పెరుగుదలతో పాటు, సంస్థ వ్యయం 60 శాతం తగ్గించడంతో నష్టాలను కొంత తగ్గాయని కంపెనీ తెలిపింది. ‘కొవిడ్-19 సంక్షోభం సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, గత త్రైమాసికంలో మాదిరిగానే రెండో త్రైమాసికంలో నికర నష్టాలను గణనీయంగా తగ్గించగలిగామని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున రికవరీ చాలా వేగంగా, బలంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం స్పైస్‌జెట్ షేర్ ధర 6.61 శాతం పెరిగి రూ. 54.85 వద్ద ఉంది.