మలార్ బ్యూటీకి బర్త్ డే ట్రీట్..

సాయి పల్లవి .. మలయాళీ కుట్టి. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బంగారు బొమ్మ. ఫిదా మూవీతో తెలుగునాట అడుగుపెట్టిన తెలంగాణ పిల్ల. భాష, యాసతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ రౌడీ బేబీ… తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతమున్న హీరోయిన్లలో బెస్ట్ ఆప్షన్ అనిపించుకుంటుంది. ఒక సీన్ షూటింగ్ ఉందని చెప్తే… సెట్ కి వచ్చామా.. మనపని మనం చూసుకున్నామా.. వెళ్లామా అని కాకుండా.. అసలు ఆ సీన్ ఎందుకు ఇలాగే చేస్తున్నారు.. మరోలా ఎందుకు […]

Update: 2020-05-09 01:35 GMT

సాయి పల్లవి .. మలయాళీ కుట్టి. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బంగారు బొమ్మ. ఫిదా మూవీతో తెలుగునాట అడుగుపెట్టిన తెలంగాణ పిల్ల. భాష, యాసతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ రౌడీ బేబీ… తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతమున్న హీరోయిన్లలో బెస్ట్ ఆప్షన్ అనిపించుకుంటుంది. ఒక సీన్ షూటింగ్ ఉందని చెప్తే… సెట్ కి వచ్చామా.. మనపని మనం చూసుకున్నామా.. వెళ్లామా అని కాకుండా.. అసలు ఆ సీన్ ఎందుకు ఇలాగే చేస్తున్నారు.. మరోలా ఎందుకు చేయకూడదు అని డైరెక్టర్ దగ్గర అన్ని వివరాలు తెలుసుకుని మరీ అందుకు తగినట్లుగా తనను తాను మౌల్డ్ చేసుకుంటుంది. శేఖర్ కమ్ముల ఫిదా తో ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి… ఆ తర్వాత వచ్చిన ప్రతీ సినిమాలోనూ తన ముద్ర వేయగలిగింది. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. తన స్టెప్పులతో చూపు తిప్పుకోకుండా చేయగలదు. ఊర మాస్ స్టెప్పులతో ప్రేక్షకుల తో విజిల్స్ వేయించగలదు.

డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన సాయి పల్లవి.. సినిమా ఇండస్ట్రీకి దొరకడం నిజంగా గొప్ప బహుమతి అంటుంటారు. ఆమె సినిమాల్లోకి రాకపోయి ఉంటే మంచి నటిని మిస్ అయ్యే వాళ్లం అని చెప్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలు చేస్తుండగా.. మే 9న తన పుట్టిన రోజు కావడంతో స్పెషల్ ట్రీట్ ఇచ్చాయి మూవీ యూనిట్స్. విరాట పర్వం నుంచి విడుదలైన మలార్ బ్యూటీ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలంగాణ బతుకు పోరాటం నేపథ్యంలో సాగే కథ సినిమా కాగా అమరవీరుల స్థూపం ఎదుట కూర్చున్న సాయి పల్లవి లుక్ చాలా నేచురల్ గా ఉంది. చేతిలో పుస్తకం, పెన్ను పక్కనే పాత బ్యాగ్ తో కనిపిస్తున్న సాయి పల్లవి ..అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్థూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్న అక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి?ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే తెలుస్తాయి.

అల్లరి చేసినా… కొంటె పనులు చేసినా… హుందాగా ఉన్నా.. లవర్ గా కనిపించినా.. భార్యగా నటించినా .. మాస్ స్టెప్ వేసినా… మరే పాత్ర అయినా ఇట్టే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలదు సాయి పల్లవి. ఫిదా సినిమాతో ఓ కొంటె పిల్లను తెలుగు తెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల… అదే అమ్మాయితో లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. చైతూకి జోడీగా అల్లరి ప్రేమికురాలుగా కనిపించనున్న సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చింది ఆ మూవీ యూనిట్. ఈ సినిమా నుంచి సాయి పల్లవి లుక్ విడుదల కాగా.. వర్షంలో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్న మలార్ అందానికి ఫిదా అయిపోయారు.

Tags : Sai Pallavi, Virataparvam, Love Story, BirthDay, wishes

Tags:    

Similar News