రంగుల పండగకి ప్రత్యేక రైళ్లు రెడీ
దిశ, వెబ్ డెస్క్: హోలి పండుగ సందర్భంగా దక్షిణమధ్యరైల్వే ప్రయాణికులకు తీపి కబురును అందించింది. పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలోపెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 24న హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ నుంచి బీహార్ రాష్ట్రంలోని రాక్సల్ రైల్వే స్టేషన్ వరకు 07040 నంబర్‌తో హోలి ప్రత్యేక రైలును, అదేవిధంగా ఈనెల 25న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోరఖ్‌పూర్ (07003) వరకు […]
దిశ, వెబ్ డెస్క్: హోలి పండుగ సందర్భంగా దక్షిణమధ్యరైల్వే ప్రయాణికులకు తీపి కబురును అందించింది. పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలోపెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 24న హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ నుంచి బీహార్ రాష్ట్రంలోని రాక్సల్ రైల్వే స్టేషన్ వరకు 07040 నంబర్‌తో హోలి ప్రత్యేక రైలును, అదేవిధంగా ఈనెల 25న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోరఖ్‌పూర్ (07003) వరకు మరో రైలును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. , అలాగే ఈ ప్రత్యేక రైళ్లు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న రైళ్లని, ఇవి మళ్లీ31, 30 తేదీల్లో తిరుగు ప్రయాణం అవుతాయన్నారు.