ఆక్సిజన్ రైళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ఆక్సిజన్ రైళ్లు వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరేలా పర్యవేక్షణకు రైల్వేలోని వివిధ విభాగాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలతో ఆక్సిజన్ రైళ్లు సగటున గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని వెల్లడించారు. భారతీయ రైల్వే.. కొవిడ్-19 తీవ్రతను అధిగమించడానికి వైద్య ఆక్సిజన్ సరఫరా కోసం ఆక్సిజన్ […]

Update: 2021-05-28 10:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆక్సిజన్ రైళ్లు వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేరేలా పర్యవేక్షణకు రైల్వేలోని వివిధ విభాగాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలతో ఆక్సిజన్ రైళ్లు సగటున గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని వెల్లడించారు. భారతీయ రైల్వే.. కొవిడ్-19 తీవ్రతను అధిగమించడానికి వైద్య ఆక్సిజన్ సరఫరా కోసం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నిరంతరంగా నడిపిస్తూ వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించడానికి అహర్నిశలు క‌ృషిచేస్తుందన్నారు. భారతీయ రైల్వే 13 రోజుల వ్యవధిలోనే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్ర ప్రదేశ్‌కు 18 రైళ్ల ద్వారా 66 ట్యాంకర్లలో మొత్తం 1,069 మెట్రిక్ టన్నుల ద్రవ రూప వైద్య ఆక్సిజన్‌ను సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఈ రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా చూడాలని ఆయన రైల్వే బృందాలకు సూచించారు.

Tags:    

Similar News