పర్యావరణ హితం.. ఆవుపేడ, మట్టితో గణపతి విగ్రహాలు
దిశ, కామారెడ్డి రూరల్: పర్యావరణాన్ని కాపాడుదాం.. జల కాలుష్యాన్ని నివారిద్దాం.. గోమాతను రక్షిద్దాం.. మట్టి, ఆవుపేడతో చేసిన గణపతిలను పూజిద్దాం అంటున్న.. కామారెడ్డికి చెందిన దివ్యాంగురాలు అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ విగ్రహాల ద్వారా పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని పైగా జలచరాలకు ఇబ్బందులు ఉండవని వారు పేర్కొంటున్నారు. నివాసాల్లో, గణేష్ మండపాల వద్ద వీటిని ప్రతిష్టించి పూజలు చేయడం ద్వారా ఎంతో మంచిదని అంటున్నారు. పర్యావరణానికి హాని చేసే ఎలాంటి రంగులు, వస్తువులు ఉపయోగించకుండా సహజంగా […]
దిశ, కామారెడ్డి రూరల్: పర్యావరణాన్ని కాపాడుదాం.. జల కాలుష్యాన్ని నివారిద్దాం.. గోమాతను రక్షిద్దాం.. మట్టి, ఆవుపేడతో చేసిన గణపతిలను పూజిద్దాం అంటున్న.. కామారెడ్డికి చెందిన దివ్యాంగురాలు అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ విగ్రహాల ద్వారా పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని పైగా జలచరాలకు ఇబ్బందులు ఉండవని వారు పేర్కొంటున్నారు. నివాసాల్లో, గణేష్ మండపాల వద్ద వీటిని ప్రతిష్టించి పూజలు చేయడం ద్వారా ఎంతో మంచిదని అంటున్నారు. పర్యావరణానికి హాని చేసే ఎలాంటి రంగులు, వస్తువులు ఉపయోగించకుండా సహజంగా చెరువులోని మట్టి, ఆవు పేడతో వీటిని తయారు చేస్తున్నామని దివ్యాంగురాలు పోశవ్వ తెలిపారు. మట్టి, ఆవుపేడతో చేసిన గణపతిలు కావాలంటే కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలో గల రాజీవ్ గృహకల్పను సంప్రదించాలని సూచించారు.