గాంధీ ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ

కరోనా రోగులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో.. ఆసుపత్రి పరిశుభ్రతపై కూడా అంతే స్థాయిలో దృష్టిసారిస్తున్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. ప్రతి రోజు రెండు గంటలకు ఒకసారి డిస్ ఇన్ఫెక్ట్ లిక్విడ్‌తో క్లీన్ చేస్తున్నామని తెలిపారు. ఉదయం, సాయంత్రం ఆసుపత్రి ఆవరణ మొత్తం స్ర్పే చేస్తున్నామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోలుకొని డిశ్చార్జి అయిన పేషంట్లు ఆసుపత్రిలో అందిస్తున్న […]

Update: 2020-04-25 01:45 GMT

కరోనా రోగులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో.. ఆసుపత్రి పరిశుభ్రతపై కూడా అంతే స్థాయిలో దృష్టిసారిస్తున్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. ప్రతి రోజు రెండు గంటలకు ఒకసారి డిస్ ఇన్ఫెక్ట్ లిక్విడ్‌తో క్లీన్ చేస్తున్నామని తెలిపారు. ఉదయం, సాయంత్రం ఆసుపత్రి ఆవరణ మొత్తం స్ర్పే చేస్తున్నామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోలుకొని డిశ్చార్జి అయిన పేషంట్లు ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్స, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు డాక్టర్ రాజారావు పేర్కొన్నారు.

Tags: gandhi hospital, superintendent Dr.Rajarao, Hygiene, hyd

Tags:    

Similar News