ఎన్టీఆర్‌కు స్పెషల్ గిఫ్ట్స్..

‘రణం.. రుధిరం.. రౌద్రం’ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు గిఫ్ట్ లేదని ఆ మూవీ యూనిట్ ప్రకటించడంతో తారక్ ఫ్యాన్స్‌ నిరాశపడ్డ సంగతి తెలిసిందే. అయితే వారిని ఉత్సాహపరిచేందుకు వరుసగా వచ్చిన బహుమతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కానుక లేకపోతే ఏంటి.. మేము మిమ్మల్ని సంతృప్తిపడేలా చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాస్‌కా బాప్‌కు ఫలక్‌నుమా దాస్ గిఫ్ట్.. ఫలక్‌నుమా దాస్ సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొంది.. హిట్‌ మూవీతో తాజాగా మరో […]

Update: 2020-05-20 09:05 GMT

‘రణం.. రుధిరం.. రౌద్రం’ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు గిఫ్ట్ లేదని ఆ మూవీ యూనిట్ ప్రకటించడంతో తారక్ ఫ్యాన్స్‌ నిరాశపడ్డ సంగతి తెలిసిందే. అయితే వారిని ఉత్సాహపరిచేందుకు వరుసగా వచ్చిన బహుమతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కానుక లేకపోతే ఏంటి.. మేము మిమ్మల్ని సంతృప్తిపడేలా చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

మాస్‌కా బాప్‌కు ఫలక్‌నుమా దాస్ గిఫ్ట్..

ఫలక్‌నుమా దాస్ సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొంది.. హిట్‌ మూవీతో తాజాగా మరో హిట్ అందుకున్న హీరో విశ్వక్‌సేన్ తారక్‌కు వీరాభిమాని. దీంతో తారక్ అభిమానులందరూ ఆనందంగా ఉండేందుకు ఈ అభిమాని.. ఎన్టీఆర్‌పై ఓ రాప్ సాంగ్ రిలీజ్ చేశాడు. మాస్‌కా బాప్‌కు ట్రిబ్యూట్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కానుక

‘ప్రతీ జనరేషన్‌లోనూ ఒక కొత్త ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే వాడొస్తాడు, వాడినే టార్చ్ బేరర్ అంటారు. ఈ జనరేషన్‌కు ఆ టార్చ్ బేరర్ తారక్’ అంటూ విష్ చేస్తూ అదిరిపోయే వీడియో రిలీజ్ చేసింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఈ బ్యానర్‌లోనే త్రివిక్రమ్‌తో కలిసి తన 30వ సినిమా చేయబోతున్నారు తారక్. అందుకే ఈ స్పెషల్ వీడియోతో స్పెషల్ విష్ చేసింది. ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.

Tags:    

Similar News