రాష్ట్రవ్యాప్తంగా 6900 కొనుగోలు కేంద్రాలు : స్పీకర్ పోచారం

దిశ, నిజామాబాద్: రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా 6900 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు సబాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కుర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన పని లేదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, […]

Update: 2020-04-23 08:23 GMT

దిశ, నిజామాబాద్: రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా 6900 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు సబాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కుర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన పని లేదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డీసీఎస్‌ఓ మమత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Nizamabad,speaker, pocharam srinivas reddy,Start,sunflower purchase center

Tags:    

Similar News