నాన్న వైద్యానికి స్పందిస్తున్నారు : ఎస్పీ చరణ్

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు ఆయన వైద్యానికి స్పందించడం లేదని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. అయితే, తన తండ్రి ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. మంగళవారం ఎస్పీ బాలు ఆరోగ్యం విషయంపై ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తన తండ్రి వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందన్నారు. ఇన్నాళ్లుగా నాన్న త్వరగా […]

Update: 2020-08-25 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు ఆయన వైద్యానికి స్పందించడం లేదని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. అయితే, తన తండ్రి ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. మంగళవారం ఎస్పీ బాలు ఆరోగ్యం విషయంపై ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తన తండ్రి వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందన్నారు.

ఇన్నాళ్లుగా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ, ఎంజీఎం వైద్యులకు కూడా చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది శుభపరిణామమని తన తండ్రి త్వరలో కోలుకుని, ఇంటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఎస్పీ బాలు పలుభాషల్లో పాటలు పాడటం వల్ల అనేక భాషల్లో ఆయనకు అభిమానులున్నారని, అందుకోసమే ఈ వీడియోను ఇంగ్లీష్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News