ఇలాంటి వార్తలు హార్ట్‌ఎటాక్ తెప్పిస్తాయి : బాలు
– జానకమ్మ ఆరోగ్యంపై ఎస్పీబీ క్లారిటీ సౌత్ ఇండియన్ నైటింగేల్ ఎస్. జానకి మరణించారన్న ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వార్తపై చాలా మంది సింగర్లు, యాక్టర్లు ఆవేదన వ్యక్తం చేయగా.. జానకమ్మ ఆరోగ్యంపై క్లారిటీనిచ్చారు గాయకులు ఎస్పీ బాలు. ఈ వార్త తనను కలిచివేసిందని చెప్పిన బాలు.. సోషల్ మీడియాను పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఉపయోగించాలి తప్ప, ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడానికి కాదని అన్నారు. జానకమ్మ ఆరోగ్యం చాలా […]
– జానకమ్మ ఆరోగ్యంపై ఎస్పీబీ క్లారిటీ
సౌత్ ఇండియన్ నైటింగేల్ ఎస్. జానకి మరణించారన్న ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వార్తపై చాలా మంది సింగర్లు, యాక్టర్లు ఆవేదన వ్యక్తం చేయగా.. జానకమ్మ ఆరోగ్యంపై క్లారిటీనిచ్చారు గాయకులు ఎస్పీ బాలు.
ఈ వార్త తనను కలిచివేసిందని చెప్పిన బాలు.. సోషల్ మీడియాను పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఉపయోగించాలి తప్ప, ఇలాంటి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడానికి కాదని అన్నారు. జానకమ్మ ఆరోగ్యం చాలా బాగుందన్నారు. తనకు కోట్ల మంది అభిమానులు ఉన్నారని.. ఇలాంటి వార్త వింటే నిజంగానే హార్ట్ ఎటాక్ వస్తుందని చెప్పారు. దయచేసి ఒక న్యూస్ స్ప్రెడ్ చేసేటప్పుడు నిజమా? కాదా? అనేది తెలుసుకోవాలని సూచించారు.
కాగా జానకమ్మ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళీ భాషలతో పాటు దాదాపు 17 భాషల్లో 45 వేలకు పైగా పాటలు పాడారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్‌లో ఆమె ఎక్కువ పాటలు పాడారు.