నైరుతి ఆగమనం.. మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలకు..!
దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం(IMD) ప్రకటించింది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, ఏపీకి విస్తరించినట్లు సమాచారం. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణకు విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతపవనాల రాకతో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.