సీఎంల సమావేశం… ఆ అంశంపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ

దిశ,వెబ్‌డెస్క్: మార్చి4 న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపులకు సంబధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ అజెండాపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని లేఖలో వెల్లడించింది. పోలవరం ముంపును కూడా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనితో పాటు పలు అంశాలను అజెండాలో చేర్చాలని […]

Update: 2021-02-27 21:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: మార్చి4 న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపులకు సంబధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ అజెండాపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని లేఖలో వెల్లడించింది. పోలవరం ముంపును కూడా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనితో పాటు పలు అంశాలను అజెండాలో చేర్చాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News