రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..

దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 25(శుక్రవారం) నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్పెషల్ సర్వీసుల్లో 6 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించనుండగా మరో 16 రైళ్లు వీక్ల్సీ సర్వీసులు ఉన్నాయి. అయితే ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేనే ఈ రైళ్లలో ప్రయాణించవచ్చు. స్పెషల్ రైళ్ల వివరాలు: Train No 07487: కడప-విశాఖ […]

Update: 2021-06-24 02:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 25(శుక్రవారం) నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్పెషల్ సర్వీసుల్లో 6 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించనుండగా మరో 16 రైళ్లు వీక్ల్సీ సర్వీసులు ఉన్నాయి. అయితే ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేనే ఈ రైళ్లలో ప్రయాణించవచ్చు.
స్పెషల్ రైళ్ల వివరాలు:
Train No 07487: కడప-విశాఖ మధ్య నడిచే ఈ ట్రైన్ జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 07488: విశాఖ-కడప మధ్య నడిచే ట్రైన్(డైలీ) జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 08479: భువనేశ్వర్ నుంచి తిరుపతి మధ్య ప్రతీ శనివారం నడిచే ఈ వీక్లీ ట్రైన్ జులై 3 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02852: హెచ్.నిజాముద్దీన్-విశాఖపట్నం మధ్య వారానికి రెండు సార్లు(బుధవారం, ఆదివారం) నడిచే ట్రైన్ జులై 4 నుంచిఅందుబాటులోకి వస్తుంది.
Train No 02831: విశాఖపట్నం నుంచి లింగంపల్లి ట్రైన్(డైలీ) జులై 01 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 2832: లింగంపల్లి-విశాఖపట్నం ట్రైన్(డైలీ) జులై 02 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 02851: విశాఖపట్నం-హెచ్.నిజాముద్దీన్ మధ్య వారానికి రెండు సార్లు(సోమవారం, శుక్రవారం) నడిచే ఈ ట్రైన్ జులై 2 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 08480: తిరుపతి-భువనేశ్వర్ మధ్య ప్రతీ ఆదివారం నడిచే ఈ స్పెషల్ ట్రైన్ జులై 04 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02870: చెన్నై సెంట్రల్-విశాఖపట్నం మధ్య వారానికి ఒక సారి(మంగళవారం) నడిచే ట్రైన్ ఈ జులై 6 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 02869: విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ మధ్య వారానికి ఒక సారి(సోమ) నడిచే ట్రైన్ జులై 5 నుంచి అందుబాటులోకి రానుంది.

 

Tags:    

Similar News