మహిళ రికార్డు : ఒకే కాన్పులో 10మంది పిల్లలు

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు కవలపిల్లలకు జన్మనివ్వడం సాధారణమైన విషయమే అయితే ఒక కాన్పులో ఇద్దరూ లేదా ముగ్గురికి జన్మనివ్వడం జరుగుతుంది. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే 37ఏళ్ల మహిళ ఏడుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే పదిమందికి జన్మనిస్తుందన్న విషయం ఆమెకు తెలియదు. దీంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. ఆరు […]

Update: 2021-06-09 01:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు కవలపిల్లలకు జన్మనివ్వడం సాధారణమైన విషయమే అయితే ఒక కాన్పులో ఇద్దరూ లేదా ముగ్గురికి జన్మనివ్వడం జరుగుతుంది. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే 37ఏళ్ల మహిళ ఏడుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే పదిమందికి జన్మనిస్తుందన్న విషయం ఆమెకు తెలియదు. దీంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది.

ఆరు నెలల గర్భం ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారని, ఆ తర్వాత మరోసారి స్కాన్ చేసినప్పుడు 8 మంది ఉన్నట్లు గుర్తించారని, పిల్లలు పుట్టినప్పుడు మాత్రం మొత్తం 10 మంది ఉన్నట్లు తేలిందని తెలిపారు. అయితే వైద్యుల రిపోర్టులను అధిగమించి ఒకేసారి ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడంతో వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. కాగా ఆమెకు ఇప్పటికే ఆరేళ్ల వయసున్న కవలపిల్లలు ఉన్నారు. గోసియామే థమారా సిథోలే భర్త తెబోగో సోతెత్సీ మాట్లాతూ ఇంత మంది పుట్టడం ఆనందంగా ఉందని వారందరినీ జాగ్రత్తగా చూసుకుంటానని వివరించారు.

Tags:    

Similar News