సెంచూరియన్ టెస్టులో చెలరేగిన మహ్మద్ షమీ.. తోకముడిచిన సఫారీలు
దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ చేశారు. 327 పరుగులు చేసి మూడో రోజు ఆలౌట్ అయిన టీమిండియా.. లక్ష్య ఛేదనకు వచ్చిన సఫారీ బ్యాటర్లను చిత్తు చేసింది. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఎల్గర్‌ను(1) క్యాచ్ అవుట్ చేయడంతో బౌలర్లలో ఉత్సాహం నిండింది. ఇదే అదునుగా బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చిన మహ్మద్ షమీ చెలరేగిపోయాడు. మర్కరమ్ (13), పీటర్సన్ (15)లను […]
దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ చేశారు. 327 పరుగులు చేసి మూడో రోజు ఆలౌట్ అయిన టీమిండియా.. లక్ష్య ఛేదనకు వచ్చిన సఫారీ బ్యాటర్లను చిత్తు చేసింది. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఎల్గర్‌ను(1) క్యాచ్ అవుట్ చేయడంతో బౌలర్లలో ఉత్సాహం నిండింది. ఇదే అదునుగా బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చిన మహ్మద్ షమీ చెలరేగిపోయాడు. మర్కరమ్ (13), పీటర్సన్ (15)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక డస్సెన్ (3) పరుగులకే సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తెంబా బవుమా (52), క్వింటాన్ డీకాక్(34) కాసేపు క్రీజులో కుదురుకున్నారు. ఇదే సమయంలో శార్దూల్ ఠాకూర్ డీకాక్(34)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో మళ్లీ భారత్ ఆధిపత్యం కొనసాగించింది. ఆ వెంటనే మల్డర్(12) వికెట్ తీసుకున్న షమీ.. హాఫ్ సెంచరీతో ఫామ్‌లో ఉన్న తెంబా బవుమా(52)ను కూడా పెవిలియన్ పంపడంతో మిడిలార్డర్ కుప్పకూలింది.
మార్కో జాన్‌సన్ (19), రబాడ (25), మహరాజ్ (12) పరుగులకే వికెట్లు పారేసుకున్నారు. దీంతో 197 పరుగులకే సౌతాఫ్రికా జట్టు కుప్పకూలింది. ముఖ్యంగా టీమిండియాలో 5 వికెట్లు తీసుకుని మహ్మద్ షమీ కీలకంగా వ్యవహరించాడు. ఠాకూర్, బూమ్రా తలో 2, సిరాజ్ 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.