ఏటీకే మోహన్ బగాన్ బోర్డుకు సౌరవ్ గంగూలీ రాజీనామా
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఆడుతున్న ఏటీకే మోహన్ బగాన్ జట్టు బోర్డుకు సౌరవ్ గంగూలీ రాజీనామా చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ.. ఫుట్‌బాల్ క్లబ్ అయిన ఏటీకే మోహన్ బగాన్ జట్టు బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. అయితే, ఇటీవల కొత్త జట్ల కోసం బిడ్లు పిలవగా.. లక్నో ఫ్రాంచైజీని ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ. 7,090 కోట్లకు కైవసం చేసుకున్నది. ఏటీకే మోహన్ బగాన్ జట్టుకు ఆర్పీ సంజీవ్ […]
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఆడుతున్న ఏటీకే మోహన్ బగాన్ జట్టు బోర్డుకు సౌరవ్ గంగూలీ రాజీనామా చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ.. ఫుట్‌బాల్ క్లబ్ అయిన ఏటీకే మోహన్ బగాన్ జట్టు బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. అయితే, ఇటీవల కొత్త జట్ల కోసం బిడ్లు పిలవగా.. లక్నో ఫ్రాంచైజీని ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ. 7,090 కోట్లకు కైవసం చేసుకున్నది. ఏటీకే మోహన్ బగాన్ జట్టుకు ఆర్పీ సంజీవ్ గోయెంకా సహ యజమానిగా ఉన్నారు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. ఐపీఎల్ జట్టు యజమాని సంస్థలో డైరెక్టర్‌గా ఉండటం ‘పరస్పర విరుద్ద ప్రయోజనాలు’ కిందకు వస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఉండటం గంగూలీపై వచ్చిన ఆరోపణలపై ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సౌరవ్ గంగూలీని కోరగా.. ‘తాను ఏటీకే మోహన్ బగాన్ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని ప్రకటించారు.