రెడ్ బికినీలో హీరోయిన్ బాడీ కాన్ఫిడెన్స్ పోస్ట్
దిశ, సినిమా: యాక్ట్రెస్ – మోడల్ – సింగర్ సోఫీ చౌదరి బాడీ కాన్ఫిడెన్స్ పోస్ట్ వైరల్ అయింది. గ్లోబల్ స్పా మ్యాగజైన్‌పై బికినీలో మెరిసిన భామ.. తనలోని లోపాల గురించి ప్రస్తావించింది. 2000 సంవత్సరంలో సింగర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోఫి.. ఆ తర్వాత ఎంటీవీ లవ్ లైన్ షో హోస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలో షో మేకర్స్ తనను బికినీ వేసుకోవాలని సూచించడంతో ఒక్క సారిగా షాక్ అయ్యానని, హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నానని […]
దిశ, సినిమా: యాక్ట్రెస్ – మోడల్ – సింగర్ సోఫీ చౌదరి బాడీ కాన్ఫిడెన్స్ పోస్ట్ వైరల్ అయింది. గ్లోబల్ స్పా మ్యాగజైన్‌పై బికినీలో మెరిసిన భామ.. తనలోని లోపాల గురించి ప్రస్తావించింది. 2000 సంవత్సరంలో సింగర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోఫి.. ఆ తర్వాత ఎంటీవీ లవ్ లైన్ షో హోస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలో షో మేకర్స్ తనను బికినీ వేసుకోవాలని సూచించడంతో ఒక్క సారిగా షాక్ అయ్యానని, హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నానని తెలిపింది. కారణం అక్కడ ప్రతీ ఒక్కరు అందమైన శరీరం కలిగి ఉన్నారని, కానీ తన బాడీ మాత్రం ‘ఫుల్ ఆఫ్ కర్వ్స్’తో ఉందనే భయం వల్ల ఆ సాహసం చేయలేకపోయానని చెప్పింది సోఫి.
అయితే తనకు తాను ప్రత్యేకమని అంగీకరించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకునేందుకు చాలా సంవత్సరాలు పట్టిందని తెలిపింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై పనిచేయడం మహిమాన్విత విషయమని చెప్పింది. మనలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదని, ప్రతీ ఒక్కరిలోనూ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయన్న సోఫి.. మన మీద మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మనలో ఉన్న లోపాలు కూడా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయని తెలిపింది. స్పష్టంగా, పరిపూర్ణంగా ఉండటం బోరింగ్ అన్న తన పోస్ట్‌తో బాడీ షేమింగ్‌తో బాధపడుతున్న వారిలో పాజిటివ్‌నెస్ నింపింది సోఫీ చౌదరి.