కొంతమంది దుష్ప్రచారాలు మానుకోవాలి: ఈటల
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ పేషట్ లకు మెగురైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, దయచేసి కొంతమంది దుష్ప్రచారాలు మానుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం మంత్రి ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి సూపరింటెండెంట్‌తో పాటు ఇతర వైద్యాధికారులతో మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి, సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రిలో 1370బెడ్లు అందుబాటులో ఉన్నాయని […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ పేషట్ లకు మెగురైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, దయచేసి కొంతమంది దుష్ప్రచారాలు మానుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం మంత్రి ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి సూపరింటెండెంట్‌తో పాటు ఇతర వైద్యాధికారులతో మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి, సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రిలో 1370బెడ్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ రోగుల కోసం 945బెడ్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 245మంది రోగులు ఉన్నారని, ఇంకా 300మందికి కూడా వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
100 వెంటిలేటర్లు, 100ఐసీయూ బెడ్లు ఉన్నట్లు తెలిపారు. 470వరకు లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు, నిరంతరాయంగా వారం రోజుల పాటు నడిచినా అందుకు సరిపోయే ఆక్సిజన్ కెపాసిటీ ఎంజీఎం ఆస్పత్రిలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో అవసరమైన ఆర్‌టీపీసీఆర్ కిట్లు, రెమిడిసివిఆర్ మందులు, ఇంజక్షన్లు సరిపోను ఉన్నాయని తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్‌లతో 100శాతం నిర్ధారణ జరుగుతోందని, ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి లేదని, ఇప్పటి వరకు జరిగిన పరీక్షలను పరిశీలిస్తే అదే రుజువవుతోందని అన్నారు. ఎంజీఎం ఆస్పత్రి ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తోందని అన్నారు.