ఆ దేశంలో ఎఫ్‌బీపై నిషేధం
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’పై మరో దేశం నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. కానీ, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు ఈ సోషల్ నెట్‌వర్క్‌ను గతంలోనే బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు సోలోమన్ ఐలాండ్స్ కూడా చేరింది. ప్రపంచ దేశాలను కరోనా ఆర్థికంగా ఎంతో నష్టపరిచింది. ఎంతోమంది తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. తమ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడీలో పెట్టేందుకు అన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’పై మరో దేశం నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. కానీ, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు ఈ సోషల్ నెట్‌వర్క్‌ను గతంలోనే బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు సోలోమన్ ఐలాండ్స్ కూడా చేరింది.
ప్రపంచ దేశాలను కరోనా ఆర్థికంగా ఎంతో నష్టపరిచింది. ఎంతోమంది తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. తమ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడీలో పెట్టేందుకు అన్ని దేశాలు ఉద్దీపన చర్యలను చేపట్టాయి. మన దేశంలోనూ రేషన్‌కార్డు దారులకు ప్రతి వ్యక్తికి పది కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం, మూడు సిలిండర్లను ఫ్రీగా అందించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగదు సాయం అందించాయి. సోలోమన్ ఐలాండ్స్ ప్రభుత్వం కూడా ఉద్దీపన నిధుల్ని విడుదల చేసింది. అయితే ఈ నిధుల పంపిణీలో అవకవతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా ఆరోపణలు వచ్చాయి
. సోలోమన్ ఐలాండ్స్ ప్రభుత్వం వ్యాపారం నిమిత్తం చైనాతో పొత్తు కలిపింది. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఫేస్‌బుక్ వేదికగా ప్రభుత్వ తీరుపై, మంత్రులు, ప్రైమ్ మినిస్టర్‌పై నెటిజన్లు మండిపడ్డారు. తీవ్రంగా దూషించారు. ఆయా నేతల క్యారెక్టర్‌ను తప్పుపట్టడంతోపాటు, వారి గౌరవానికి భంగం కలిగేలా తీవ్రంగా విమర్శలు చేశారు. దాంతో సమాచార, విమానాయాన శాఖ మంత్రి పీటర్ షానల్ అగొవకా ఫేస్‌బుక్‌పై తాత్కాలిక నిషేధం విధించారు.
సోలోమన్ ఐలాండ్స్ పాపులేషన్ 7 లక్షలు కాగా, ఎక్కువమంది ప్రజలు ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్ మీద ఎలాంటి చట్టాలు, రెగ్యులేషన్స్ లేకపోవడంతో నెటిజన్లు చెలరేగిపోతున్నారని అక్కడి అధికార పార్టీ నేతలు వ్యాఖ్యనించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఫేస్‌బుక్ వారధిగా ఉందని, ప్రభుత్వ తీరును ప్రజలు విమర్శించడం వల్ల ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేయడం సరైన పని కాదని ప్రతిపక్షాలు అభిప్రాయపడతున్నాయి.