తమ్ముడి కోసం అన్న ప్రాణత్యాగం.. సింగూరులో దొరికిన మృతదేహం
దిశ, ఆందోల్ : సింగూర్ ప్రాజెక్టులో తమ్ముడిని కాపాడేందుకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. సోమవారం మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లి శివారులోని ప్రాజెక్టు వద్ద సోహెల్ (27) మృతదేహం లభ్యమైనట్టు జాలరులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. హైదరాబాదులోని ఇబ్రహీం బాగ్‌కు చెందిన తైహిఫ్, సోహెల్ అన్నదమ్ములిద్దరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టు సందర్శన నిమిత్తం ఆదివారం సింగూరుకు వచ్చారు. ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండటంతో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన తైహిఫ్‌ను […]
దిశ, ఆందోల్ : సింగూర్ ప్రాజెక్టులో తమ్ముడిని కాపాడేందుకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. సోమవారం మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లి శివారులోని ప్రాజెక్టు వద్ద సోహెల్ (27) మృతదేహం లభ్యమైనట్టు జాలరులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. హైదరాబాదులోని ఇబ్రహీం బాగ్‌కు చెందిన తైహిఫ్, సోహెల్ అన్నదమ్ములిద్దరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టు సందర్శన నిమిత్తం ఆదివారం సింగూరుకు వచ్చారు. ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండటంతో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన తైహిఫ్‌ను కాపాడేందుకు వెళ్ళిన సోహెల్ ప్రాజెక్ట్ వరదలో గల్లంతైన విషయం తెలిసిందే.
సమాచారం అందుకున్న అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసేసి రెస్క్యూ టీం, స్థానిక జాలర్ల సాయంతో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం సోహెల్ మృతదేహం నీటిలోని పక్కన పొదల్లో చిక్కుకున్నట్టు గుర్తించిన జాలర్లు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడకు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సోహెల్ మృతదేహం లభ్యం కావడం, సింగూర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.