పర్యావరణ దినోత్సవానికి.. SNAP CHAT ‘స్పెషల్ బిట్‌మోజీ’లు
దిశ, ఫీచర్స్ : ప్రకృతితో ప్రాణులకు విడదీయరాని అభినవ సంబంధం ఉంది. మనిషి ప్రకృతిని కాపాడితే అది తిరిగి భూమిపై ఉన్న జీవరాశుల్ని కాపాడుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు చేపట్టేలా ప్రోత్సహించేందుకు ఏటా జూన్ 5న మనం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి రాబోయే ఎన్విరాన్‌మెంట్ డేను పురస్కరించుకుని స్నాప్‌చాట్ కొత్తగా బిట్‌మోజీలను విడుదల చేసింది. వీటితో స్నాప్‌చాట్ వినియోగదారులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని వర్చువల్ వరల్డ్‌లో ముందుగానే […]
దిశ, ఫీచర్స్ : ప్రకృతితో ప్రాణులకు విడదీయరాని అభినవ సంబంధం ఉంది. మనిషి ప్రకృతిని కాపాడితే అది తిరిగి భూమిపై ఉన్న జీవరాశుల్ని కాపాడుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు చేపట్టేలా ప్రోత్సహించేందుకు ఏటా జూన్ 5న మనం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి రాబోయే ఎన్విరాన్‌మెంట్ డేను పురస్కరించుకుని స్నాప్‌చాట్ కొత్తగా బిట్‌మోజీలను విడుదల చేసింది. వీటితో స్నాప్‌చాట్ వినియోగదారులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని వర్చువల్ వరల్డ్‌లో ముందుగానే సెలబ్రేట్ చేసుకోవచ్చు.
మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1973లో నిర్వహించుకున్నాం. అయితే ఆనాటి నుంచి ప్రతి ఏటా ఓ కొత్త ‘థీమ్’తో వివిధ నగరాల్లో వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డేను సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’ పేరుతో చైనాలో సదస్సు నిర్వహించగా, 2020లో ‘టైమ్ ఫర్ నేచర్’ థీమ్‌ను ఎంపిక చేశారు. ఇక ఈ ఏడాది ‘ఎకో సిస్టమ్ రిస్టోరేషన్’ (పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ) థీమ్ కాగా, ఆ నేపథ్యంలోనే స్నాప్ చాట్ బిట్‌మోజీలను తీసుకొచ్చింది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో సాయపడే వివిధ అలవాట్లను ప్రదర్శించడంతో పాటు, ప్రిజర్వ్ ఎనర్జీ ప్రాముఖ్యతను తెలిపేలా ఈ ఎమోజీలు రూపొందించారు. ఈ క్రమంలోనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం మొత్తం తొమ్మిది రకాలైన డెడికేటెడ్ బిట్‌మోజీలున్నాయి. విద్యుత్ శక్తిని ఆదా చేయడానికి, ఉపయోగంలో లేనప్పుడు ఎలక్ట్రికల్ ఉపకరణాలను, లైట్లను ఆపివేయాలని సందేశాత్మకమైన ఎమోజీతో పాటు, వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించే మరో బిట్‌మోజీ కొత్త జాబితాలో ఉన్నాయి.
చాట్ విభాగం నుంచి స్నాప్‌చాట్‌లోని స్నేహితులతో బిట్‌మోజీలను పంచుకోవచ్చు. మీరు స్నాప్‌చాట్‌లో ఏదైనా చాట్‌ను తెరిచి, ఆపై టెక్స్ట్ బార్ పక్కన ఉన్న బిట్‌మోజీ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు. ఇక్కడ, మీరు ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన బిట్‌మోజీలను కనుగొంటారు.ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వివిధ స్పెషల్ డేస్ సందర్భంగా స్నాప్‌చాట్ బిట్‌మోజీలను క్రమం తప్పకుండా పరిచయం చేస్తుంది. ఇటీవలే ‘ఎర్త్ డే’ పురస్కరించుకుని ప్రత్యేక బిట్‌మోజీలను విడుదలచేసింది. భారతీయ పండుగలైన హోలీ, ఉగాది నేపథ్యంలోనూ బిట్ మోజీలను రిలీజ్ చేసింది.