ప్రమాదంలో పొగరాయుళ్లు.. కరోనా ముప్పు వారికే అధికం

న్యూఢిల్లీ: పొగరాయుళ్లకు కరోనా ముప్పు అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సివియర్‌గా మారడం, లేదా మరణించే ముప్పు స్మోకర్లకు 50శాతం ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ పేర్కొన్నారు. కాబట్టి ప్రపంచదేశాలు స్మోకింగ్‌ను తగ్గించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డబ్ల్యూహెచ్‌వో క్యాంపెయిన్‌లో పాలుపంచుకుని పొగాకు రహిత ప్రపంచానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. పొగాకు మానడానికి కావాల్సిన సమాచారం, ఇతర అంశాలు టూల్‌కిట్‌లో ఉచితంగా […]

Update: 2021-05-29 09:51 GMT

న్యూఢిల్లీ: పొగరాయుళ్లకు కరోనా ముప్పు అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సివియర్‌గా మారడం, లేదా మరణించే ముప్పు స్మోకర్లకు 50శాతం ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ పేర్కొన్నారు. కాబట్టి ప్రపంచదేశాలు స్మోకింగ్‌ను తగ్గించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డబ్ల్యూహెచ్‌వో క్యాంపెయిన్‌లో పాలుపంచుకుని పొగాకు రహిత ప్రపంచానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. పొగాకు మానడానికి కావాల్సిన సమాచారం, ఇతర అంశాలు టూల్‌కిట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటాయని వివరించారు.

Tags:    

Similar News