15 కోట్లకు స్వల్ప దూరంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్
దిశ, వెబ్‌డెస్క్: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020లో 15 కోట్ల యూనిట్లను దాటడానికి 4 శాతం మాత్రమే క్షీణించిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. గతేడాది రెండో భాగంలో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉండటం వల్లే కొంత మేరకు అమ్మకాలు పెరిగాయని కౌంటర్ పాయింట్ సంస్థ అభిప్రాయపడింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో షావోమీ 26 శాతంతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, తర్వాతి స్థానంలో శాంసంగ్ 20 శాతాన్ని, వీవో 15 శాతం, రియల్‌మీ 11 […]
దిశ, వెబ్‌డెస్క్: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020లో 15 కోట్ల యూనిట్లను దాటడానికి 4 శాతం మాత్రమే క్షీణించిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. గతేడాది రెండో భాగంలో వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉండటం వల్లే కొంత మేరకు అమ్మకాలు పెరిగాయని కౌంటర్ పాయింట్ సంస్థ అభిప్రాయపడింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో షావోమీ 26 శాతంతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, తర్వాతి స్థానంలో శాంసంగ్ 20 శాతాన్ని, వీవో 15 శాతం, రియల్‌మీ 11 శాతం, ఒప్పో 10 శాతాన్ని కలిగి ఉన్నాయి.
ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పుంజుకుందని, నవంబర్ నెలలో దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ నెలలో అత్యధికంగా స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేసినట్టు సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రచీర్ సింగ్ చెప్పారు. రానున్న రోజుల్లో ఎక్కువమంది ఫీచర్ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు మారుతున్న క్రమంలో ప్రస్తుత డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నట్టు, తక్కువ ధరల శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు మరింత పెరుగుతాయని ఆయన తెలిపారు. బ్రాండ్ వారీగా పరిశీలిస్తే..యాపిల్, వన్‌ప్లస్, పోకో, ఐటెల్, మైక్రోమ్యాక్స్ సహా ఇతర బ్రాండ్‌లు మెరుగైన వృద్ధిని సాధించాయి. ఫీచర్‌ఫోన్ విభాగం 20 శాతం క్షీణించడంతో మొత్తం హ్యాండ్‌సెట్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 9 శాతం పడిపోయిందని కౌంటర్‌పాయింట్ వెల్లడించింది.