హైదరాబాద్‌కు రావాలంటే స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సిందే..!

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణీకులు ఆర్టీపీసీఆర్​టెస్టు కొరకు ముందే స్లాట్​బుక్ చేసుకోవాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఒమిక్రాన్​ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. ఎయిర్​సువిధా పోర్టల్‌లో సెల్ఫ్​డిక్లరేషన్‌తో పాటు టెస్టు స్లాట్​చేసుకోవచ్చని పేర్కొన్నది. ఈ నెల 20వ తేది నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా ఎయిర్​పోర్టులలో రద్దీని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా శంషాబాద్​ఎయిర్​పోర్టులో ఆర్టీపీసీఆర్ […]

Update: 2021-12-14 11:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణీకులు ఆర్టీపీసీఆర్​టెస్టు కొరకు ముందే స్లాట్​బుక్ చేసుకోవాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఒమిక్రాన్​ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. ఎయిర్​సువిధా పోర్టల్‌లో సెల్ఫ్​డిక్లరేషన్‌తో పాటు టెస్టు స్లాట్​చేసుకోవచ్చని పేర్కొన్నది. ఈ నెల 20వ తేది నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా ఎయిర్​పోర్టులలో రద్దీని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా శంషాబాద్​ఎయిర్​పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులకు అధిక ధరలు తీసుకుంటున్నారని ఇప్పటికే పలువురు ప్రయాణీకులు వైద్యారోగ్యశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టెస్టులు నిర్వహించాలని ఆరోగ్యశాఖ మరోసారి ఆదేశించింది. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకునే టెస్టు ధరను వసూల్ చేస్తున్నామని ఎయిర్​పోర్టులో టెస్టులు నిర్వహిస్తున్న ప్రైవేట్​ల్యాబ్ చెబుతున్నది. టెస్టు నిర్ధారణకు అతి ఖరీదైన రసాయనాలు వాడుతున్నామని, అందుకు ధరలు ఎక్కువ తీసుకుంటున్నట్లు ల్యాబ్​నిర్వహుకులు చెప్పుకొస్తున్నారు. సగటున ఒక్కో టెస్టుకు 3500 నుంచి 4 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News