వాహనదారులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై 14 పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు 35 రోజుల తర్వాత ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.105.95గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. ఇక విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.65, డీజిల్‌ […]

Update: 2021-08-22 00:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై 14 పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు 35 రోజుల తర్వాత ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.105.95గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. ఇక విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.65, డీజిల్‌ ధర రూ. 98.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.67గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 97.67గా ఉంది.

Tags:    

Similar News