నిద్రపోయిన బాల్క సుమన్.. రెచ్చిపోయిన నెటిజన్లు
దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండ్రోజులుగా ట్విట్టర్‌లో చెన్నూరు నియోజవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం నియోజకవర్గంలో జరిగిన ఓ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నారాయణపూర్‌లో ఓ యువతికి మూర్చ వచ్చింది. అయితే అత్యవసరంగా అంబులెన్స్ వచ్చినా ఊళ్లోకి రావడానికి వాగు అడ్డురావడంతో అవతలి ఒడ్డుకే ఆగిపోయింది. దీంతో ఆ యువతి సోదరుడే ఆమెను భుజాలపై వేసుకుని వాగు దాటి వెళ్లి అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ […]
దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండ్రోజులుగా ట్విట్టర్‌లో చెన్నూరు నియోజవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం నియోజకవర్గంలో జరిగిన ఓ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నారాయణపూర్‌లో ఓ యువతికి మూర్చ వచ్చింది. అయితే అత్యవసరంగా అంబులెన్స్ వచ్చినా ఊళ్లోకి రావడానికి వాగు అడ్డురావడంతో అవతలి ఒడ్డుకే ఆగిపోయింది. దీంతో ఆ యువతి సోదరుడే ఆమెను భుజాలపై వేసుకుని వాగు దాటి వెళ్లి అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియో నిన్నటి నుంచి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇవేమి పట్టించుకోకుండా ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం నిద్రపోతున్న ఫొటోను ట్వీట్ చేశారు.
చెన్నూరు టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలో ‘‘హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామంలో పల్లె నిద్రలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు’’ అని ట్వీట్ చేశారు. అయితే దీనిపై రెచ్చిపోయిన నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తూ మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెటిజన్ల కామెంట్స్ లో ‘‘నిన్న నీ నియోజకవర్గంలో ఒక అమ్మాయి వాగు దాటి అంబులెన్స్ దగ్గరకు పోలేక, వాగు దాటి అంబులెన్స్ వాళ్ల దగ్గరకు వెళ్లలేక ఎంత కష్టం అయింది. నీవు ఇక్కడ వచ్చి పడుకున్నవా సార్’’, ‘‘ ముందు మీరు మీ చెన్నూర్ ప్రజల కష్టాలను పట్టించుకోండి… తర్వాత హుజురాబాద్ గురించి ఆలోచించండి @balkasumantrs ’’, ‘‘ ఫోటో స్టిల్ బానే ఇచ్చావు గాని ఆ చెన్నూర్ లో వరదలు వస్తున్నాయంట అక్కడ పోయి చూసుకో పో.. సోయి తప్పినోడా ’’, ‘‘ కన్న తల్లికి తిండి పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు కొంటాడట’’ అంటూ ట్వీట్లు, కామెంట్లు చేస్తూ బాల్క సుమన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ముందు మీరు మీ చెన్నూర్ ప్రజల కష్టాలను పట్టించుకోండి… తర్వాత హుజురాబాద్ గురించి ఆలోచించండి @balkasumantrs @KTRTRS https://t.co/6nfYmD21hd
— Anusha (@Anusha4BJP) September 5, 2021