శ్రీలంకలో ‘లంకన్ ప్రీమీయర్ లీగ్’.. ఎప్పుడంటే..
దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు వరుసబెట్టి వాయిదా పడుతుండటంతో శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని పట్టుదలతో ఉన్న ఎస్ఎల్‌సీ ఆగస్టులో టీ20 లీగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్లు సమాచారం. శ్రీలంక ప్రీమియర్ లీగ్ పేరుతో 2012లోనే ఒక సీజన్ ప్రారంభించినా ఆ తర్వాత పలు కారణాల వల్ల ఎస్‌పీఎల్‌ను రద్దు చేసింది. తాజాగా లంకన్ ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) పేరుతో సరికొత్త […]
దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు వరుసబెట్టి వాయిదా పడుతుండటంతో శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని పట్టుదలతో ఉన్న ఎస్ఎల్‌సీ ఆగస్టులో టీ20 లీగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్లు సమాచారం. శ్రీలంక ప్రీమియర్ లీగ్ పేరుతో 2012లోనే ఒక సీజన్ ప్రారంభించినా ఆ తర్వాత పలు కారణాల వల్ల ఎస్‌పీఎల్‌ను రద్దు చేసింది. తాజాగా లంకన్ ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) పేరుతో సరికొత్త లీగ్ ఏర్పాటు చేసింది. ‘ఇప్పటికే విదేశీ ఆటగాళ్లతో కూడా సంప్రదింపులు జరిపాము. ఈ ఏడాది ఎల్‌పీఎల్ నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. దీనికి సంబంధించిన వివరాలను ఇతర క్రికెట్ బోర్డులకు కూడా అందించాం’ అని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డిసిల్వా అన్నారు. శ్రీలంకలో కరోనా కేసులు తక్కువగా ఉండటంతో క్వారంటైన్ నిబంధన కూడా లేదు. దీంతో విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది వచ్చినా వాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని డిసిల్వ పేర్కొన్నారు. కాబట్టి ఆగస్టులో లంకన్ ప్రీమియర్ లీగ్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.