ఈ ఏడాదిలో కొత్తగా నాలుగు వాహనాల విడుదల : స్కోడా ఇండియా!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా భారత్‌లో పలు రకాల ఉత్పత్తులను ప్రారంభించాలని భావిస్తోంది. అంతేకాకుండా అమ్మకాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని, కార్ల తయారీలో స్థానిక ఉత్పత్తిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. భారత్‌లో పోటీతత్వం అధికంగా ఉన్న ప్యాసింజర్ వాహనాల విభాగంలో సంస్థ వ్యాపారాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ‘కంపెనీ బ్రాండ్‌పై అవగాహన చేపట్టడానికి, ఆర్థికంగా బలమైన డీలర్‌షిప్ భాగస్వామ్యాలను తీసుకురావాలని సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో స్థిరమైన బ్రాండ్‌గా ఎదిగేందుకు […]

Update: 2021-03-21 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా భారత్‌లో పలు రకాల ఉత్పత్తులను ప్రారంభించాలని భావిస్తోంది. అంతేకాకుండా అమ్మకాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని, కార్ల తయారీలో స్థానిక ఉత్పత్తిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. భారత్‌లో పోటీతత్వం అధికంగా ఉన్న ప్యాసింజర్ వాహనాల విభాగంలో సంస్థ వ్యాపారాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది.

‘కంపెనీ బ్రాండ్‌పై అవగాహన చేపట్టడానికి, ఆర్థికంగా బలమైన డీలర్‌షిప్ భాగస్వామ్యాలను తీసుకురావాలని సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో స్థిరమైన బ్రాండ్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలను పెంచనున్నట్టు స్కోడా ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రతాప్ బొపరాయ్ చెప్పారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేవలం రెండు ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తున్నామని, ఇటీవల విడుదలైన కాంపాక్ట్ ఎస్‌యూవీ కుషాక్‌తో సహా నాలుగు ఉత్పత్తులను ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్టు బొపరాయ్ వెల్లడించారు.

 

 

Tags:    

Similar News