గుడ్‌న్యూస్.. ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ ప్రారంభం
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో హెటిరో, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఉస్మానియా ఆస్పత్రిలో స్కిన్ బ్యాంక్ ఏర్పాటు […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో హెటిరో, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఉస్మానియా ఆస్పత్రిలో స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాలిన గాయాలతో ఆస్పత్రికి వచ్చే వారి ప్రాణాలు కాపాడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని.. ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారని మహమూద్ అలీ కొనియాడారు.