ఆటో, కారు ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు
దిశ, వెబ్ డెస్క్: ఆటో ను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది. నిజాంపేట మండలం నందిగామ నుంచి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు బ్లాంకెట్స్ అమ్ముకొని తిరిగి రామాయంపేటకు ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో లో ఉన్న ఆరుగురు కాళ్లు, చేతులు విరిగాయి. పలువురికి తలలకు […]
దిశ, వెబ్ డెస్క్: ఆటో ను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
నిజాంపేట మండలం నందిగామ నుంచి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు బ్లాంకెట్స్ అమ్ముకొని తిరిగి రామాయంపేటకు ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో లో ఉన్న ఆరుగురు కాళ్లు, చేతులు విరిగాయి. పలువురికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ గాంధీ దవాఖానకి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఘటనపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిలో సిరాజ్, రిజ్వాన్, వెంకటేష్, ప్రవీణ్ తో పాటు ఆటో డ్రైవర్ నాగరాజు ఉన్నారు.