దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోంది -సీతారాం ఏచూరి
దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ నాశనం నిరంతరాయంగా కొనసాగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ నేత సీతారాం ఏచూరి. జాతీయ ఆస్తులను దోచుకుంటూ ప్రైవేట్ మూలధనానికి రుణాలు కల్పించే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎక్కువగా దేశీయ వస్తువులను కొనేలా చేయడం ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, ఉపాధి కల్పించడానికి ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మందికి వెంటనే నగదు […]
దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ నాశనం నిరంతరాయంగా కొనసాగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ నేత సీతారాం ఏచూరి. జాతీయ ఆస్తులను దోచుకుంటూ ప్రైవేట్ మూలధనానికి రుణాలు కల్పించే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేవని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఎక్కువగా దేశీయ వస్తువులను కొనేలా చేయడం ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, ఉపాధి కల్పించడానికి ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మందికి వెంటనే నగదు బదిలీ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీతారాం.