పాటల కుక్క..బతికే ఉంది!
దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణ ప్రభావమో లేదా మానవుల అధిక వినియోగమో తెలియదు కానీ, అరుదైన జంతుజాతులన్నీ ఒక్కొక్కటిగా అంతరించిపోతున్నాయి. ఇలాంటి జాతులను జూలు, సంరక్షణ కేంద్రాల్లో ఉంచి పెంచినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అలాంటి ఒక జాతికి చెందినదే ఈ పాటల కుక్క. ప్రస్తుతానికి కొన్ని జూలలో మాత్రమే ఇది బతికి ఉందని, అడవుల్లో ఇది లేదని పూర్తిగా వీటి జాతి ప్రకృతిలో అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ కుక్కల జాతుల్లో కొన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణ ప్రభావమో లేదా మానవుల అధిక వినియోగమో తెలియదు కానీ, అరుదైన జంతుజాతులన్నీ ఒక్కొక్కటిగా అంతరించిపోతున్నాయి. ఇలాంటి జాతులను జూలు, సంరక్షణ కేంద్రాల్లో ఉంచి పెంచినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అలాంటి ఒక జాతికి చెందినదే ఈ పాటల కుక్క. ప్రస్తుతానికి కొన్ని జూలలో మాత్రమే ఇది బతికి ఉందని, అడవుల్లో ఇది లేదని పూర్తిగా వీటి జాతి ప్రకృతిలో అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ కుక్కల జాతుల్లో కొన్ని కుక్కలు న్యూగినియా పర్వతపాంత్ర దీవుల్లో బతికే ఉన్నట్లు తెలిసింది.
1970ల దశకం నుంచి కనిపించకుండా పోయిన ఈ జాతి కుక్కల దంతాల గుర్తులు, కొన్ని ఫొటోలు పపువా ద్వీపాల వద్ద లభించాయి. అక్కడ జీవిస్తున్న ఆదిమ తెగ వాసులు ఈ కుక్కలను చూసినట్లు చెప్పారని న్యూగినియా హైల్యాండ్ వైల్డ్ డాగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు జేమ్స్ మెక్‌ఇంటైర్ తెలిపారు. కొండల మాటున దాక్కుని రాత్రి కాగానే తమ అరుపులతో ఒక పాట పాడుతున్న అనుభూతిని కల్పిస్తాయి. కాబట్టే వాటిని సింగింగ్ డాగ్స్..పాటలు కుక్కలు అని పిలుస్తారు. తమ దగ్గర ఉన్న 149 ఫొటోల సాయంతో ఆ ప్రదేశంలో దాదాపుగా 15 వరకు పాటల కుక్కలు ఉన్నట్లు తాము అంచనా వేసినట్లు జేమ్స్ తెలిపారు.