బాలుకు నా వల్ల కరోనా రాలేదు : మాళవిక
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితిపై ఎప్పటికీ అప్పుడు అప్ డేట్ ఇస్తున్న బాలు తనయుడు ఎస్పీ చరణ్ గురువారం రాత్రి తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కన్నీరు పెట్టుకున్నారు. ఎస్పీబీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తన గురించి ప్రార్థనలు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే బాలుకు కరోనా సోకేందుకు కారణం సింగర్ మాళవిక అని ప్రచారం జరుగుతోంది. తనకు కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా బాలు […]
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితిపై ఎప్పటికీ అప్పుడు అప్ డేట్ ఇస్తున్న బాలు తనయుడు ఎస్పీ చరణ్ గురువారం రాత్రి తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కన్నీరు పెట్టుకున్నారు. ఎస్పీబీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తన గురించి ప్రార్థనలు చేయాలని కోరారు.
ఇదిలా ఉంటే బాలుకు కరోనా సోకేందుకు కారణం సింగర్ మాళవిక అని ప్రచారం జరుగుతోంది. తనకు కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా బాలు హాజరయ్యే ఓ కార్యక్రమానికి హాజరు అయిందని..తన నుంచి బాలుకు కొవిడ్ సంక్రమించిందని సోషల్ మీడియాలో కొందరు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన మాళవిక బాలు గారి అనారోగ్యానికి తాను కారణం కాదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని కోరిన ఆమె.. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, బాలు గారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేశం మొత్తం కోరుకుంటుంది. సినీ ప్రముఖులు అందరూ తన గురించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఎప్పటిలాగే బాలు గారి గాత్రం తమను మెస్మరైజ్ చేయాలని కోరుకుంటున్నారు.