సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న మోడీ, కేసీఆర్..
దిశ, తాండూర్ : కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మానందం, హెచ్ఎమ్ఎస్ ఏరియా ఉపాధ్యక్షులు పి. రాజబాబు, టిఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మణిరాం సింగ్ ఆరోపించారు. సింగరేణి సమ్మెలో భాగంగా శనివారం గోలేటి బస్టాండ్ నుండి జీఎం కార్యాలయం వరకు నాయకులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీఎం కార్యాలయం ముందు […]
దిశ, తాండూర్ : కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మానందం, హెచ్ఎమ్ఎస్ ఏరియా ఉపాధ్యక్షులు పి. రాజబాబు, టిఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మణిరాం సింగ్ ఆరోపించారు. సింగరేణి సమ్మెలో భాగంగా శనివారం గోలేటి బస్టాండ్ నుండి జీఎం కార్యాలయం వరకు నాయకులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీఎం కార్యాలయం ముందు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని ఉపసంహరించుకొని వెంటనే సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మిక వర్గంపై ప్రేమ ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతరమంతర్ వద్ద అన్ని సంఘాలతో కలిసి ధర్నా చేయాలన్నారు. నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ పంపించాలని కోరారు. కోల్‌బెల్ట్ ఏరియా ఎంపీలు పార్లమెంట్‌లో సింగరేణి గనుల ప్రైవేటీకరణ, సమస్యలపై ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
సింగరేణిలోని 49 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాను తెలంగాణ రాష్ట్రమే కొనుగోలు చేసి, సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, మోడీ ఒక్కటేనని.. ఇద్దరు కలిసి కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, సాగర్ గౌడ్, నర్సయ్య, తిరుపతి, పొశం, శ్రీనివాస్, గంగయ్య, యాదగిరి, మల్లయ్య, సూర్యనారాయణ, వేణు, ధర్మయ్య, ప్రవీణ్, పాల్గొన్నారు.