ఐవీఎఫ్ పద్ధతిలో తొలి సింహం ‘సింబా’

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాల క్రితం నుంచే మానవులు కృత్రిమ గర్భధారణ పద్ధతుల(ఐవీఎఫ్)ను అవలంభిస్తుండగా, తొలిసారి ఈ పద్ధతి ద్వారా తొలి సింహపు పిల్ల జన్మించింది. సింగపూర్ జూ ఇందుకు వేదిక కాగా, హాలీవుడ్ క్రేజీ మూవీ ‘సింబా’ ఇన్‌స్పిరేషన్‌తో ఆ బుజ్జి సింహానికి ‘సింబా’గా, దాని తండ్రికి ‘ముఫాసా’గా పేర్లు పెట్టారు. అయితే ముఫాసా చనిపోవడం దురదృష్టకరం. ముఫాసా 20 ఏళ్లు జీవించగా, దాని అగ్రెసివ్ బిహేవియర్ కారణంగా ఆడ సింహాలతో ఎప్పుడూ సంగమం కాలేదు. దాంతో […]

Update: 2021-01-30 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్దాల క్రితం నుంచే మానవులు కృత్రిమ గర్భధారణ పద్ధతుల(ఐవీఎఫ్)ను అవలంభిస్తుండగా, తొలిసారి ఈ పద్ధతి ద్వారా తొలి సింహపు పిల్ల జన్మించింది. సింగపూర్ జూ ఇందుకు వేదిక కాగా, హాలీవుడ్ క్రేజీ మూవీ ‘సింబా’ ఇన్‌స్పిరేషన్‌తో ఆ బుజ్జి సింహానికి ‘సింబా’గా, దాని తండ్రికి ‘ముఫాసా’గా పేర్లు పెట్టారు. అయితే ముఫాసా చనిపోవడం దురదృష్టకరం.

ముఫాసా 20 ఏళ్లు జీవించగా, దాని అగ్రెసివ్ బిహేవియర్ కారణంగా ఆడ సింహాలతో ఎప్పుడూ సంగమం కాలేదు. దాంతో ఆ సింహపు వారసత్వాన్ని కొనసాగించేందుకు జూ అధికారులు ఐవీఎఫ్ ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆ వృద్ధ సింహం వీర్యాన్ని ఎలెక్ట్రో ఇజాక్యులేషన్ డివైజ్ సాయంతో సేకరించారు. ఎలక్ట్రిక్ పల్స్ సిమెన్ ఎక్స్‌ట్రాక్షన్ ప్రాసెస్ తర్వాత, ఆ 20 ఏళ్ల ముఫాసా తన ప్రాణం కోల్పోయింది. ముఫాసా వయసు రిత్యా వచ్చిన క్షీణతతో పాటు, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల చనిపోయిందని జూ అధికారులు స్పష్టం చేశారు. ఇక ముఫాసకు జన్మించిన సింబా ఆరోగ్యంగా ఉండగా, ప్రస్తుతం దానికి 3 నెలలు. ఇది అక్టోబర్‌లో జన్మించగా, ముఫాసా చనిపోవడం, కృత్రిమ గర్భధారణతో పుట్టిన తొలి సింహం కావడంతో మూడు నెలల పాటు ఈ విషయాన్ని జూ అధికారులు రహస్యంగా ఉంచారు.

సింబా తన తల్లి పాలు తాగలేకపోవడంతో, డబ్బా పాలు తాగించారు. ఇలా చేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే వైల్డ్ ఎనిమల్స్ మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడకపోతే, ఎదిగిన తర్వాత తిరస్కరించే అవకాశం ఉండటంతో, సింబాను తల్లికి సమక్షంలో ఎక్కువగా ఉంచుతున్నారు. ప్రస్తుతానికి సింబా, కయాను చూసేందుకు ఎవరికీ అనుమతివ్వడం లేదు. సింబాను తల్లి సంరక్షణలో ఉంచుతున్నారు. తద్వారా ఆ ఇద్దరి మధ్య బంధం బలపడుతుందని జూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. కృత్రిమ గర్భధారణ పద్ధతి సింహాలకు ఉపయోగించడం కొత్త విషయం కాగా, ప్రస్తుతం అరణ్యాల్లో వేగంగా తగ్గుతున్న సింహాల జనాభాను వృద్ధి చేయడానికి ఇది అవసరమని జూ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లెక్కల ప్రకారం అడవిలో 23 వేల నుంచి 39 వేల సింహాలు ‘రెడ్ జాబితా’లో ఉన్నాయి.

Tags:    

Similar News