హోం క్వారంటైన్‌లో సిద్దిపేట కలెక్టర్
దిశ, మెదక్: తెలంగాణాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొండపోచమ్మసాగర్ ముంపు గ్రామాలైన పాములపర్తి, ఇతర ముంపు గ్రామస్తులు గౌరారంలో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ ద్వారా హెచ్ఎండీఏ అనుమతి పొందే విషయమై జెడ్పీటీసీలు కలెక్టరేట్‌లో సమావేశం అయ్యారు. జెడ్పీటీసీలతో సమావేశానికి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో కలెక్టర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో […]
దిశ, మెదక్: తెలంగాణాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొండపోచమ్మసాగర్ ముంపు గ్రామాలైన పాములపర్తి, ఇతర ముంపు గ్రామస్తులు గౌరారంలో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ ద్వారా హెచ్ఎండీఏ అనుమతి పొందే విషయమై జెడ్పీటీసీలు కలెక్టరేట్‌లో సమావేశం అయ్యారు. జెడ్పీటీసీలతో సమావేశానికి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో కలెక్టర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలపై కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అర్జీల స్వీకరణ పెట్టెల్లో అర్జీలు వేయాలని, వాటిపై తమ ఫోన్ నెంబర్ రాయాలని కలెక్టర్ సూచించారు. ఆయా దరఖాస్తులను వివిధ శాఖలకు చెందిన అధికారుల ద్వారా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని, 30 నుంచి 45 రోజుల్లో సమస్యకు సమాధానం చెబుతామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.