11 ఏళ్ల కనిష్ఠానికి ప్యాసింజర్ వాహన విక్రయాలు

దిశ, వెబ్‌డెస్క్: ఏడాది క్రితం మందగమనంతో దెబ్బతిన్న వాహన విక్రయాలు ఈసారి మరింత దారుణంగా పడిపోయాయి. మే తర్వాత కోలుకున్న సంకేతాలు కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో రికవరీ జరగలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగంలో అమ్మకాలు దారుణ స్థితిలో పతనమవుతాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్(సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 11 ఏళ్ల కనిష్ఠానికి దిగజారుతాయని సియామ్(SIAM) భావిస్తోంది. 2009-10 నాటి కంటే తక్కువే ఉండవచ్చునని అంచనా వేస్తోంది. […]

Update: 2020-08-24 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏడాది క్రితం మందగమనంతో దెబ్బతిన్న వాహన విక్రయాలు ఈసారి మరింత దారుణంగా పడిపోయాయి. మే తర్వాత కోలుకున్న సంకేతాలు కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో రికవరీ జరగలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగంలో అమ్మకాలు దారుణ స్థితిలో పతనమవుతాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్(సియామ్) తెలిపింది.

ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 11 ఏళ్ల కనిష్ఠానికి దిగజారుతాయని సియామ్(SIAM) భావిస్తోంది. 2009-10 నాటి కంటే తక్కువే ఉండవచ్చునని అంచనా వేస్తోంది. అనేక రంగాల్లో డిమాండ్ లేమి కారణంగా ఇతర రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంది. దీంతో పరిశ్రమ సామర్థ్యం 50-60 శాతం ఉండవచ్చునని సియామ్ పేర్కొంది. గతేడాది జులైతో పోలిస్తే ఈసారి వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. కానీ అమ్మకాలు మాత్రం దిగజారాయి.

టూ-వీలర్ (two wheeler), కమర్షియల్, ప్యాసింజర్, త్రీ-వీలర్ (three wheeler) వాహనాల విక్రయాలు కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల క్షీణించాయి. ఇటీవల కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మొత్తం అమ్మకాలను నమోదు చేయలేకపోయాయి. దీనికితోడు, రికవరీ నెమ్మదిగా ఉందని సియామ్ తెలిపింది.

Tags:    

Similar News