సోనుసూద్ ఫౌండేషన్‌కు బేబి ఆరాధ్య విరాళం..
దిశ, బాల్కొండా : వేల్పూర్ ఎస్‌ఐ భరత్ రెడ్డి కుమార్తై ఆరాధ్య వయసులో చిన్నదైన తన పెద్ద మనసును చాటుకుంది. తాను కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న నాలుగు వేల రూపాయలను సోనుసూద్ ఫౌండేషన్ విరాళం ఇచ్చింది. ఈ సందర్బంగా ఆరాధ్య మాట్లాడుతూ.. తన తండ్రి అయిన ఎస్సై భరత్ రెడ్డి వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోగా సోనూసూద్ ఫొటో ఉండటాన్ని గమనించి తన నాన్నని అడగ్గా సోనూసూద్ పేదలకు, కరోనా బాధితులకు చేస్తున్న సాయం గురించి వివరంగా చెప్పాడని […]
దిశ, బాల్కొండా : వేల్పూర్ ఎస్‌ఐ భరత్ రెడ్డి కుమార్తై ఆరాధ్య వయసులో చిన్నదైన తన పెద్ద మనసును చాటుకుంది. తాను కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న నాలుగు వేల రూపాయలను సోనుసూద్ ఫౌండేషన్ విరాళం ఇచ్చింది. ఈ సందర్బంగా ఆరాధ్య మాట్లాడుతూ.. తన తండ్రి అయిన ఎస్సై భరత్ రెడ్డి వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోగా సోనూసూద్ ఫొటో ఉండటాన్ని గమనించి తన నాన్నని అడగ్గా సోనూసూద్ పేదలకు, కరోనా బాధితులకు చేస్తున్న సాయం గురించి వివరంగా చెప్పాడని తెలిపింది.
అలాంటి గొప్ప వ్యక్తికి తన వంతు సాయంగా తాను దాచుకున్న డబ్బును సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది. తన కూతురు చేసిన మంచి పనికి ఎస్సై భరత్ రెడ్డి గర్వపడుతూ ఆనందం వ్యక్తం చేశారు.