India vs New Zealand: రెండో రోజు టీమిండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: కాన్పూర్ వేదికగా న్యూజీలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. 345 పరుగుల వద్ద రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత ఇన్నింగ్స్ ముగించుకుంది. తొలి రోజు మొత్తం టీమిండియాదే పై చేయి అయినా.. రెండో రోజు కివీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇక టీమిండియాలో శ్రేయస్ అయ్యర్(105), శుబ్ మన్ గిల్ (52), జడేజా(50) పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ముందుకెళ్లింది. రవీచంద్ర అశ్విన్ (38), అజింక్య రహానే (35), […]
దిశ, వెబ్‌డెస్క్: కాన్పూర్ వేదికగా న్యూజీలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆలౌట్ అయింది. 345 పరుగుల వద్ద రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత ఇన్నింగ్స్ ముగించుకుంది. తొలి రోజు మొత్తం టీమిండియాదే పై చేయి అయినా.. రెండో రోజు కివీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇక టీమిండియాలో శ్రేయస్ అయ్యర్(105), శుబ్ మన్ గిల్ (52), జడేజా(50) పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ముందుకెళ్లింది. రవీచంద్ర అశ్విన్ (38), అజింక్య రహానే (35), పుజార(26) పరుగులు తీశారు. మిగతా బ్యాటర్లు 15కి మించి పరుగులు చేయలేకపోయారు. దీంతో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. ముఖ్యంగా కివీస్ బౌలర్ టిమ్ సౌథీ 5 వికెట్లు తీసుకోగా, జేమీసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఛేదన కోసం బరిలోకి దిగిన న్యూజీలాండ్ ఎలా రాణిస్తుందో వేచిచూడాల్సిందే.