జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలి

దిశ, ప్రతినిధి, మేడ్చల్: అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు రవిప్రకాశ్ అన్నారు. మంగళవారం  టీఎన్జీవో కార్యాలయంలో జిల్లాలో పనిచేస్తున్న పలువురు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా అధ్యక్షున్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్ట్ చేయించాలని కోరారు. ఇతర జిల్లాలో అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్ట్ […]

Update: 2021-12-28 08:47 GMT

దిశ, ప్రతినిధి, మేడ్చల్: అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు రవిప్రకాశ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో కార్యాలయంలో జిల్లాలో పనిచేస్తున్న పలువురు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా అధ్యక్షున్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్ట్ చేయించాలని కోరారు. ఇతర జిల్లాలో అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్ట్ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా అధ్యక్షుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధైర్యపడవద్దని సానుకూల ఉత్తర్వులు వచ్చేందుకు టీఎన్జీవో సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో..టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు జేమ్స్, ఘట్కేసర్ యూనిట్ అధ్యక్షులు గిరి కాంత్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, శామీర్ పేట యూనిట్ అధ్యక్షులు శశికుమార్, వివిధ గ్రామాల కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, స్వరూప, గీత, ఎలిజబెత్, శ్వేత, ప్రగతి, అయేషా, మహేష్, ప్రశాంత్, రంతు బాషా, శివకుమార్, జ్యోతి, శ్రీరాములు, హర్షవర్ధన్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News