పుట్టా ‘మధు’ కస్టడీ.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు వ్యవహారంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా సమాచారం. పుట్ట మధు మిస్సింగ్ మిస్టరీ తరువాత ఆయనకు అత్యంత సన్నిహితునిగా ఉన్న ఒకరిని రామగుండం కమిషనరేట్ పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారణ చేసి పూర్తి నివేదికను హైదరాబాద్‌లోని బాసులకు పంపించినట్టు తెలుస్తోంది. ఆయన ఎక్కడెక్కడ సీక్రెట్ మీటింగ్‌లో పాల్గొన్నాడు, ఆస్థులెక్కడ సంపాదించాడు, ఆయనకు బిజినెస్ పార్ట్‌నర్స్ ఎవరు అన్న వివరాలను పూర్తిగా సేకరించినట్టు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు వ్యవహారంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా సమాచారం. పుట్ట మధు మిస్సింగ్ మిస్టరీ తరువాత ఆయనకు అత్యంత సన్నిహితునిగా ఉన్న ఒకరిని రామగుండం కమిషనరేట్ పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారణ చేసి పూర్తి నివేదికను హైదరాబాద్‌లోని బాసులకు పంపించినట్టు తెలుస్తోంది.
ఆయన ఎక్కడెక్కడ సీక్రెట్ మీటింగ్‌లో పాల్గొన్నాడు, ఆస్థులెక్కడ సంపాదించాడు, ఆయనకు బిజినెస్ పార్ట్‌నర్స్ ఎవరు అన్న వివరాలను పూర్తిగా సేకరించినట్టు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నదెవరూ అన్న కోణంలో కూడా రామగుండం పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. ఈ విషయాలన్నింటిపై పూర్తి స్థాయి విచారణ చేసినట్టు తెలిసింది. ఈ వివరాలన్నింటి గురించి పుట్ట మధు నుండి పూర్తి వివరాలను పోలీసు అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇద్దరిని వేర్వేరుగా ఇంటరాగేషన్ చేసిన పోలీసు అధికారులు నివ్వరపోయే విషయాలను రాబట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఇంటలిజెన్స్ వైఫల్యమేనా..?
పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో జరుగుతున్న వాస్తవాలు ఏంటీ.. అక్కడ అసలేం జరుగుతోంది అన్న విషయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపించడంలో ఇంటలిజెన్స్ అధికారులు వైఫల్యం చెందారా అన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. నిఘా వర్గాల వైఫల్యంపై నిఘా వేసి మరీ లోపం ఎక్కడ జరిగింది.. అన్న విషయం తేలేందుకు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా.. అన్న చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.