ఎంపీ రఘురామకు షాక్.. సొంత నియోజకవర్గంలో నిరసన జ్వాలలు..

దిశ, ఏపీ బ్యూరో: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. రఘురామకు వ్యతిరేకంగా నరసాపురంలో ఏపీ బహుజన ఐక్య వేదిక భారీ ర్యాలీ చేపట్టింది. రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలను, అభివృద్ధిని పట్టించుకోని రఘురామను ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేసింది. ఓట్లేసి గెలిపించుకున్న ఎంపీ తమను మోసం చేశాడంటూ నియోజకవర్గ ప్రజలు రఘురామకృష్ణంరాజుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు దళితులపై […]

Update: 2021-06-13 07:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. రఘురామకు వ్యతిరేకంగా నరసాపురంలో ఏపీ బహుజన ఐక్య వేదిక భారీ ర్యాలీ చేపట్టింది. రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలను, అభివృద్ధిని పట్టించుకోని రఘురామను ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేసింది. ఓట్లేసి గెలిపించుకున్న ఎంపీ తమను మోసం చేశాడంటూ నియోజకవర్గ ప్రజలు రఘురామకృష్ణంరాజుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అనంతరం ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రఘురామకృష్ణంరాజుపై ఆదివారం ఉదయం గరగపర్రు గ్రామ దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దళిత వ్యతిరేకి అయిన రఘురామను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News