దళితులకు షాక్.. బ్యాంక్ ఖాతాలోని దళితబంధు డబ్బులు మాయం!
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ‘దళిత బంధు’ పథకంపై ట్విట్టర్ వేదికగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్.. దళితుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అయితే దీనిపై లబ్ధిదారుల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయని వాపోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితుల అకౌంట్లలో రూ.9.90 లక్షలు వేసిన ప్రభుత్వం వెంటనే లాగేసుకున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. అయితే దీనిపై ట్విట్టర్‌లో […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ‘దళిత బంధు’ పథకంపై ట్విట్టర్ వేదికగా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్.. దళితుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అయితే దీనిపై లబ్ధిదారుల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయని వాపోతున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితుల అకౌంట్లలో రూ.9.90 లక్షలు వేసిన ప్రభుత్వం వెంటనే లాగేసుకున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. అయితే దీనిపై ట్విట్టర్‌లో చర్చ జరుగుతోంది. నమ్మించి మోసం చేస్తున్నారని కొందరు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇస్తారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో పొద్దున దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు, రాత్రి గుంజుకున్నడు కేసీఆర్. pic.twitter.com/8OFzYu4Pp3
— Share Telangana (@ShareTelangana) September 16, 2021