భారత ప్రయాణీకులకు షాక్.. ఆ దేశంలోకి నిషేధం
న్యూఢిల్లీ: భారత్ నుంచి విమాన సేవలను కువైట్ దేశం నిషేధించింది. ఇండియా నుంచి నేరుగా వచ్చే కమర్షియల్ ఫ్లైట్‌లను బ్యాన్ చేసింది. వెంటనే ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా నుంచి నేరుగా లేదా వయా ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాల్లో కనీసం 14 రోజులు ఉన్న భారతీయులకు మినహాయింపునిస్తున్నట్టు వివరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. […]
న్యూఢిల్లీ: భారత్ నుంచి విమాన సేవలను కువైట్ దేశం నిషేధించింది. ఇండియా నుంచి నేరుగా వచ్చే కమర్షియల్ ఫ్లైట్‌లను బ్యాన్ చేసింది. వెంటనే ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా నుంచి నేరుగా లేదా వయా ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాల్లో కనీసం 14 రోజులు ఉన్న భారతీయులకు మినహాయింపునిస్తున్నట్టు వివరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. అయితే, ప్రైవేట్ ఫ్లైట్స్‌పై ఆంక్షల్లేవని స్పష్టం చేసింది. భారత్ నుంచి విమాన ప్రయాణాలపై యూకే, యూఏఈ, కెనడాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.