మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్
సోమవారం రాత్రి మధ్యప్రదేశ్ సీఎంగా బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 15 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రాలేదు. తాజాగా కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్యా సింధియా, ఆయన వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దాంతో సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు శివరాజ్‌ను ఎన్నుకున్నారు. ఆయన చేత […]
సోమవారం రాత్రి మధ్యప్రదేశ్ సీఎంగా బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 15 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రాలేదు. తాజాగా కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్యా సింధియా, ఆయన వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దాంతో సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు శివరాజ్‌ను ఎన్నుకున్నారు. ఆయన చేత సీఎంగా గవర్నర్ లాల్జీ టండన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Tags: madhya pradesh cm, bjp Leader shivraj singh chauhan, bjp