ఫాదర్ స్టాన్ స్వామిది ముమ్మాటికి హత్యే.. సంజయ్ రౌత్ ఫైర్

ముంబయి: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామిది ముమ్మాటికి హత్యేనని కేంద్రపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. ఆదివాసీలకు హక్కులు, స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించడం కుట్రనా? అని అడిగారు. 80 ఏళ్లు పైబడిన స్వాన్ స్వామి, వరవరరావులంటే ఎందుకంత జంకు అని ప్రశ్నించారు. అంతటి వృద్ధులు కూలదోసేంత బలహీనంగా ఉన్నాయా దేశపునాదులు అని పేర్కొన్నారు. ఎల్గార్ పరిషద్ కేసులో స్వామిని ఎన్ఐఏ అక్టోబర్‌లో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నది. అనారోగ్యంతో […]

Update: 2021-07-11 06:44 GMT

ముంబయి: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామిది ముమ్మాటికి హత్యేనని కేంద్రపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. ఆదివాసీలకు హక్కులు, స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించడం కుట్రనా? అని అడిగారు. 80 ఏళ్లు పైబడిన స్వాన్ స్వామి, వరవరరావులంటే ఎందుకంత జంకు అని ప్రశ్నించారు. అంతటి వృద్ధులు కూలదోసేంత బలహీనంగా ఉన్నాయా దేశపునాదులు అని పేర్కొన్నారు. ఎల్గార్ పరిషద్ కేసులో స్వామిని ఎన్ఐఏ అక్టోబర్‌లో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నది. అనారోగ్యంతో ఈ నెల 5న ఆయన హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.

స్వామి మరణంపై దేశవ్యాప్తంగా కేంద్రంపై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సామ్నా పత్రికలో రాసిన కాలమ్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్గార్ పరిషద్‌ ఈవెంట్‌లో రెచ్చగొట్టే ఉపన్యాసాలను ఖండించాల్సిందేనని, కానీ, అనంతరం కేంద్రం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని తెలిపారు. హక్కులన్నింటినీ కాలరాసేలా వ్యవహరించిందని ఆరోపించారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం అప్పుడు జార్జ్ ఫెర్నాండేజ్‌ను కుట్రదారుగా భావించిందని, ఆయన యువకుడని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరీ 80ఏళ్లు పైబడిన వృద్ధులకూ భయపడుతున్నదని తెలిపారు. మోడీ ప్రభుత్వం హిట్లర్, ముసోలినీలాంటి నియంతృత్వ ధోరణులు కలిగి ఉన్నదని ఆరోపించారు.

Tags:    

Similar News