తజికిస్థాన్‌లో భారీ భూకంపం
ఆదివారం తెల్లవారు జామున తజికిస్థాన్‌లో ఒక్కసారిగా భారీ భూకంపం సంబంవించింది.

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం తెల్లవారు జామున తజికిస్థాన్ (Tajikistan)లో ఒక్కసారిగా భారీ భూకంపం (huge earthquake) సంబంవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇది స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:24 గంటలకు (UTC సమయం) సంభవించింది. ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 16 కిలోమీటర్ల (10 మైళ్ళ) లోతులో సంభవించినట్లు EMSC నివేదించింది. భూకంప కేంద్రం తజికిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టం, మానవ హాని గురించి సమాచారం తెలియరాలేదు. 6.4 తీవ్రతతో ప్రకంపణలు స్థానిక ప్రాంతాల్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. తజికిస్థాన్ హిమాలయ భూకంప బెల్ట్‌లో ఉండడం వల్ల తరచూ భూకంపాలకు వస్తూనే ఉంటాయి. ఇటీవల ఏప్రిల్ 11న 4.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ తెలిపింది.