కరోనా ఎఫెక్ట్.. షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జనం రద్దీ నియంత్రణపై దృష్టిపెట్టాయి. మహారాష్ట్రలో కేసులు భారీగా పెరుగుతుండటంతో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కేసుల దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ […]
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జనం రద్దీ నియంత్రణపై దృష్టిపెట్టాయి. మహారాష్ట్రలో కేసులు భారీగా పెరుగుతుండటంతో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, కరోనా కేసుల దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈ రోజు రాత్రి 8గంటల నుంచి ఈ నెల 30 వరకు ఆలయాన్ని మూసి ఉంచనున్నట్టు ప్రకటించింది. కానీ, రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగనున్నాయి. ఆలయం మూసివేసినప్పటికీ ఎస్‌ఎస్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన కొవిడ్ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులు మాత్రం పనిచేస్తాయని ట్రస్టు స్పష్టంచేసింది.