శాకాహారిగా మారిన శిల్ప..

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి.. తను పూర్తి శాఖాహారిగా మారిపోయినట్టు తెలిపింది. ఇది తన జీవితంలో తీసుకున్న కఠిన నిర్ణయమని, ఒకానొక సమయంలో ఇది అసాధ్యమనుకున్నా.. ఒక కాలింగ్ లాగా అనిపించిందని చెప్పింది. ఈ విషయమై ఇన్‌స్టాలో పలు విషయాలను వెల్లడించింది. ‘శాఖాహారిగా మారడం వల్ల మానవులకే కాదు పర్యావరణానికి, జంతువులకు కూడా మేలు కలుగుతుంది. గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహంతో పాటు ప్రాణాంతక వ్యాధుల నుంచి ముప్పు తప్పుతుందని’ సూచించింది. https://www.instagram.com/p/CCShkNJhGE4/?utm_source=ig_web_copy_link ప్రకృతికి చేయగలిగినంత చేసేందుకు […]

Update: 2020-07-06 02:16 GMT

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి.. తను పూర్తి శాఖాహారిగా మారిపోయినట్టు తెలిపింది. ఇది తన జీవితంలో తీసుకున్న కఠిన నిర్ణయమని, ఒకానొక సమయంలో ఇది అసాధ్యమనుకున్నా.. ఒక కాలింగ్ లాగా అనిపించిందని చెప్పింది. ఈ విషయమై ఇన్‌స్టాలో పలు విషయాలను వెల్లడించింది. ‘శాఖాహారిగా మారడం వల్ల మానవులకే కాదు పర్యావరణానికి, జంతువులకు కూడా మేలు కలుగుతుంది. గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహంతో పాటు ప్రాణాంతక వ్యాధుల నుంచి ముప్పు తప్పుతుందని’ సూచించింది.

https://www.instagram.com/p/CCShkNJhGE4/?utm_source=ig_web_copy_link

ప్రకృతికి చేయగలిగినంత చేసేందుకు శాఖాహారమే ఉత్తమమైన మార్గం అనిపించిందని చెబుతున్న శిల్ప.. చికెన్, చేపలు లేకుండా తన ఆహారం అసంపూర్తిగా ఉండేదని, తానొక హార్డ్‌కోర్ నాన్ వెజిటేరియన్ అని చెప్పింది. తన యూట్యూబ్ చానెల్‌లోనూ మాంసాహార వంటకాలు చాలా ఉన్నాయని, ఇప్పుడు వాటిని తొలగించలేను కానీ.. ప్రస్తుతానికి శాఖాహార వంటకాలపై దృష్టి పెడతానని వెల్లడించింది. ప్రతీ ఎంపికకు ఒక సంభావ్యత ఉంటుందని.. సరైన దాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.

Tags:    

Similar News